Sri Naradapuranam-3    Chapters    Last Page

సప్తతితమోధ్యాయః = దెబ్బదియవ అధ్యాయము

ప్రభాస తీర్థ మాహాత్మ్యమ్‌

మోహిన్యువాచ:-


ప్రభాసస్తతు మాహాత్మ్యం వద మే ద్విజసత్తమ | యచ్ఛ్రుత్వాహం ప్రసన్నాత్మా ధన్యాంర స్యాం త్వత్ప్రసాదతః 1
మోహిని పలికెను-
ఓ బ్రాహ్మణోత్తమా! నాకు ప్రభాస మాహాత్మ్యమును తెలుపుము. దానిని వినిన నేను నీ అనుగ్రహముతో ప్రసన్న మనస్కురాలవై ధన్యురాలనగుదును.
వసురువాచ : -
శృణు దేవి ప్రవక్ష్యామి ప్రభాసాఖ్యం సుపుణ్యదమ్‌ | తీర్థం పాపహరం నౄణాం భక్తి ముక్తి ప్రదాయకమ్‌ 2
యస్మిన్న సంఖ్య తీర్థాని విద్యంతే విధి నందిని | సోమేశో యత్ర విశ్వేశో భగవాన్గిరి జాపతిః 3
స్నాత్వా ప్రభాసకే తీర్థే సోమనాధం ప్రపూజ్యచ | నరో ముక్తి మవాప్నోతి సత్యమే తన్మయోదితమ్‌ 4

యోజనానాం దశ ద్వే చ ప్రభాస పరిమండలమ్‌ | మధ్యే
%స్య పీఠికా ప్రోక్తా పంచయోజన విస్తృతా 5
గోచర్మమాత్రం తన్మధ్యే తీర్థం కైలాసతోధికమ్‌ | అర్కస్థలం తత్ర పుణ్యం తీర్థ మన్యత్పుశోభనమ్‌ 6
సిద్ధేశ్వరాది లింగాని యత్ర సంతి సహస్రశః | తత్ర స్నాత్వా నరో భక్త్యా సంతర్ప్య పితృదేవతాః 7
లింగాని పూజయిత్వా చ యాతి రుద్రసలోకతామ్‌ | అగ్ని తీర్థం తధాన్యచ్ఛ సాగరస్య తటే స్థితమ్‌ 8
తత్ర స్నాత్వా నరో దేవి! వహ్నిలోక మవాప్నుయాత్‌ | తత్ర దేవం కపర్థీశం సోపవాసః ప్రపూజ్య చ 9
శివలోక మవాప్నోతి భుక్త్వా భోగాని హేప్సితాన్‌ | కేదారేశం తతో గత్వా సమభ్యర్చ్య విధానతః 10
స్వర్గతిం సమవాప్నోతి విమానేన సురార్చితః | భీమేశం భైరవేశం చ చండీశం భాస్కరేశ్వరమ్‌ 11
అంగారేశం చ గుర్వీశం సోమేశం భృగుజేశ్వరమ్‌ | శనిరాహు శిఖీశాంశ్చ క్రమేద్గచ్ఛే చ్ఛతుర్దశ 12
భక్త్యా పృధక్పృధక్తేషాం పూజాం కృత్వా విధానవిత్‌ | శివసాలోక్య మాప్నోతి నిగ్రహానుగ్రహే క్షమః 13

సిద్ధేశ్వరాది పంచాన్య లింగాని విధి నందిని
! | సమర్చ్య లభ##తే సిద్ధి మైహికాముష్మికీం ధరః 14
వరారోహా మజాపాలాం మంగలాం లలితే శ్వరీమ్‌ | సంపూజ్య క్రమతశ్చైతా విపాపో జాయతేనరః 15
లక్ష్మీశ్వరం బాడవేశ మర్ఘ్యేశం కామకీశ్వరమ్‌ | సమభ్యర్చ్య నరో భక్త్యా సాక్షాల్లోకేశతాం వ్రజేత్‌ 16
గౌరీ తపోవనం ప్రాప్య గౌరీశ వరుణశ్వరౌ | ఉషేశ్వరం చ సంపూజ్య నర స్స్వర్గతి మాప్నుయాత్‌ 17
గణశం చ కుమారేశం స్వాకకేశ కులేశ్వరౌ | ఉత్తంకేశం చ వహ్నీశం గౌతమం దైత్యసూదనమ్‌ 18
సమభ్యర్చ్య విధానేన న నరో దుర్గతిం వ్రజేత్‌ | చక్రతీర్థం తతః ప్రాప్య తత్ర స్నాత్వా విధానతః 19

గౌరీ దేవీం సమభ్యర్చ్య నరో
%భిలషితం లభేత్‌ | సన్నిహత్యా హ్వయం తీర్థం ప్రాప్యతత్ర వరాననే 20
స్నాత్వా సంతర్ప్యదేవాదీన్‌ సన్నిహత్యాఫలం లభేత్‌ | అదైకాదశలింగాని భూతేశాదీని యో
%ర్చయేత్‌ 21
సలబ్ధ్వేహ వరన్భోగా నంతే రుద్రపదం వ్రజేత్‌ | ఆది నారాయణం దేవం సమభ్యర్చ్య నరోత్తమః 22
మోక్షభాగ్స భ##వేద్దేవి! నాత్ర కార్యా విచారణాః | తతశ్చక్రధరం ప్రాప్య పూజయేద్యో విధానతః 23
స తు శత్రుం వినిర్జిత్య భోగానుచ్చా వచా ంల్లభేత్‌ | సాంబాదిత్యం తతః ప్రాప్య స్నాత్వా నియమ పూర్వకమ్‌ 24
నీరోగో ధనధాన్యాఢ్యో జాయతే మానవో భువి | తతస్తు మనుషః ప్రాప్య దేవీం కంటక శోధినీమ్‌ 25
మహిషఘ్నీం చ సంపూజ్య నిర్దయో జాయతే నరః
వసువు పలికెను :-
ఓ మోహినీ ! నరుల పాపములను హరించి భుక్తి ముక్తులను పుణ్యమును ప్రసాదించు ప్రభాస తీర్థ మహాత్మ్యమును చెప్పెదను వినము. ఈ తీర్థమున చాలా తీర్థములు కలవు. గిరిజాపతియగు విశ్వేశ్వరుడు సోమేశుడు నివసించు చుండెను. ప్రభాస తీర్థమున స్నానమాడి సోమనాధుని పూజించి ముక్తిని పొందును. ప్రభాస తీర్థకుండల విస్తీర్ణము ద్వాదశయోజనములు. ఈ మండలమధ్య భాగమున పంచయోజన విస్తీర్ణ ప్రాంతము పీఠిక యనబడును. ఈ మధ్య భాగమున గోచర్మ మాత్ర ప్రాంతము కైలాసమున కంటే విశిష్ఠమైనది. ఇచటనే పుణ్యప్రదమగు అర్కస్థలమను తీర్థము కలదు. ఇచట సిద్ధేశ్వరాది సహస్రలింగములు కలవు. ఇచట భక్తిచే స్నానము చేసి పితరులను నరులను తృప్తి పరిచి లింగములను పూజించి రుద్రలోకమును పొందును. అట్లే సాగర తీరమున అగ్ని తీర్థము కలదు. ఇచట స్నానముచేసి అగ్ని లోకమున చేరును. ఇచట కపర్దీశ##దేవుని ఉపవాసముతో పూజించి ఇహలోకమున అభీష్టములను పొంది శివలోకమును చేరును. తరువాత కేదారేశమునకు వెళ్ళి యధావిధిగా పూజించి దేవతల పూజలనంది విమానముతో స్వర్గమును పొందును. భీమేశుని, భైరవేశుని, చండేశుని భాస్కరేశ్వరుని, అంగారేశుని, గుర్వీశుని సోమేశుని, భృగుజేశ్వరుని,శని రాహు శిఖేశులను పదునాలుగు మందిని యధాక్రమముగా వెళ్ళ వలయును. భక్తిచే విడి విడిడా వారిని పూజించి నిగ్రహానుగ్రహసమర్థుడై శివలోకమును చేరును. సిద్ధేశ్వరాది పంచాన్య లింగములను చక్కగా పూజించి ఇహ పరములందు సిద్ధిని పొందును. వరారోహను, అజాపాలను, మంగలను, లలితేశ్వరిని, వీరిని క్రమముగా పూజించి పాపరహితుడగును. లక్ష్మీశ్వరుని, బాడవేశుని అర్ఘ్యేశుని, కామకేశ్వరుని చక్కగా పూజించి లేకేశత్వమును పొందును. గౌరీ తపోవనమును చేరి గౌరీశ వరుణశ్వరులను, ఉషేశ్వరుని పూజించి స్వర్గమును పొందును. గణశుని కుమారేశుని, స్వాకకేశ మహేశ్వరులను, ఉత్తంకేశుని వలహ్నీశుని, గౌతముని దైత్య సూదనుని యధావిధిగా పూజించిన వారు దుర్గతిని పొందజాలరు. తరువాత చక్ర తీర్థమును చేరి యధావిధిగా స్నానమాడి గౌరీదేవిని పూజించి లభీష్టమును పొందును. అచటనే సన్నిహత్య తీర్థమును పొంది స్నానమాడి దేవాదులకు తృప్తి పరిచి సన్నిహత్యా ఫలమును పొందును. తరువాత భూతేశాది ఏకాదశ లింగములను పూజించిన వారు ఇహమున ఉత్తమ భోగములనను భవించి అంతమున రుద్రలోకమును చేరును. ఆదినారాయణ దేవుని చక్కగా పూజించి మోక్షమును పొందును. తరువాత చక్రధరుని చేరి యధావిధిగా పూజించి శత్రు విజయముతో ఉన్నత భోగములను పొందును. తరువాత సాంబాదిత్యుని చేరి నియమ పూర్వకముగా స్నానము చేసి రోగరహితుడై ధనధాన్యయుతుడై యుంéడును. తరువాత వంటకశోధినీ దేవిని చేరి మహిషఘ్నిని పూజించి భయరహితుడగును.
కపాలీశం చ కోటీశం సమభ్యర్చ్య నరోత్తమః | 26
సుసౌభాగ్యో భ##వేదేవం మధ్యయాత్రాం సమాపయేత్‌ | బాల బ్రహ్మభిధం పశ్చా త్ప్రాప్యమర్త్యో నరేశ్వరి! 27
జాయతే భుక్తి ముక్తేశ స్సర్వదేవ ప్రపూజితః | నరకేశం తతః ప్రాప్య సంవర్తేశం నిధీశ్వరమ్‌ 28
బలభ్రద్రేశ్వరం ప్రార్చ్య జాయతే భుక్తి ముక్తి మాన్‌ | గంగాగణపతిం ప్రాప్య సమభ్యర్చ్య విధానతః 29
లభ##తే వాంఛితాన్కామా నిహలోకే పరత్రచ | తతో జాంబవతీం ప్రాప్య నదీం భక్త్యా సమాహితః 30
స్నాత్వా సురాదీనభ్యర్చ్య కృతకృత్యో భవన్నేరః | పాండు కూపే తతస్స్నాత్వా పాండవేశ్వర మర్చయేత్‌ 31
స నరస్స్వర్గ మాయాతి క్రీడతే నంద నాదిషు | శతమేధం లక్షమేధం కోటిమేధ మనుక్రమాత్‌ 32
లింగత్రయం సమభ్యర్చ్య మోదతే దివి దేవవత్‌ | దుర్వాసాదిత్యకం దృష్ట్వా సంపూజ్య చ విధానతః 33
అశ్వమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోత్యసంశయమ్‌ | యాదవస్థల మాసాద్య వర్షేశం ప్రార్చ్య మానవః 34
లభ##తే వాచితాం సిద్దిం దేవరాజేన సత్కృతః | హిరణ్యా సంగమే స్నాత్వా దద్యాద్ధెమరధం ద్విజే 35
శివముద్ధిశ్య యోభక్త్యా సలోకానక్షయాం ల్లభేత్‌ | నగరార్కం తతః ప్రార్చ్య సూర్యలోకమవాప్నుయాత్‌ 36
నగరాదిత్య పార్వ్శేతు బలకృష్ణా సుభద్రికామ్‌ | దృష్ట్వా సంపూజ్య విధినా కృష్ణాసాయుజ్య మాప్నుయాత్‌ 37
కుమారికాం తతః ప్రాప్య సమభ్యర్చ్య విధానతః | లభ##తే వాంఛితాన్కామా ఞ్జ యేచ్ఛక్రం నసంశయః 38
క్షేత్రపాలం తత్యోభ్యర్చ్య సర్వాన్కామానవాప్నుయాత్‌ | బ్రహ్మైశ్వరం చ సంపూజ్య సరస్వత్యాస్తటేస్థితమ్‌ 39
సర్వ పాప వినిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే | పింగలాఖ్యాం నదీం ప్రాప్య స్నాత్వా తత్ర సురాదికాన్‌ 40
సంతర్ప్య శ్రాద్ధకృన్మర్త్యో నేహ భూయోభిజాయతే | సంగమేశం సమభ్యర్చ్య న నరో దుర్గతిం వ్రజేత్‌ 41
సం ప్రార్చ్య శంకరాదిత్యం ఘటేశం చ మహేశ్వరహమ్‌ | మానవస్సకలా న్కామా ప్ప్రాప్నుయాన్నాత్ర సంశయః 42
ఋషితీర్థం తతః ప్రాప్య స్నాత్వా నియత మానసః | ఋసీంస్తత్ర సమభ్యర్చ్య సర్వతీర్థ ఫలం లభేత్‌ 43
నందాదిత్యం తతః ప్రార్చ్య ముచ్యతే సర్వరోగతః | త్రితకూపం తతః ప్రాప్య స్నాత్వా యాతి దివం నరః 44
శశోపానే నర స్స్నాత్వా దేవాన్పశ్యతి మోహిని! | వాంఛితాంశ్చ లభేత్కామా న్సత్యం సత్యం మయోదితమ్‌ 45
పర్ణాదిత్యం నరో దృస్ట్వా నీరోగో భోగవాన్భవేత్‌ | తతోన్యం కుమతీం ప్రాప్య స్నాత్వా తత్ర విధానతః 46
సిద్ధేశ్వరం సమర్చ్యాత్ర అణిమాదిక సిద్ధిభాక్‌ | వారాహస్వామినం దృష్ట్వా ముచ్యతే భవసాగరాత్‌ 47
ఛాయాలింగం సమబ్యర్చ్య ముచ్యతే సర్వపాతకైః | గుల్ఫం దృష్ట్వా నరోభ్యర్చ్య చాంద్రాయణ ఫలం లభేత్‌ 48
దేవీం కనకనందాం చ సమభ్యర్చ్య సరస్వ్సతి ! | సర్వాన్కామానవాప్నోతి దేహాన్తే స్వర్గతిం లభేత్‌ 49
కుంతీశ్వరం సమభ్యర్చ్య ముచ్యతే సర్వపాతకైః | గంగేశ్వరం సమభ్యర్చ్య గంగాయాం మనుజః ప్లుతః 50
త్రివిధేభ్యోపి పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః | చమ సోద్భేదకే స్నాత్వా పిండదానం కరోతి యః 51
గయా కోటి గుణం పుణ్యం స లభేన్నాత్ర సంశయః | తతస్తు విధిజే గత్వా విదురాశ్రమముత్తమమ్‌ 52
త్రిగం త్రిభువనేశం చ సంపూజ్యాత్ర సుఖీ భ##వేత్‌ | మంకణశ్వర మభ్యర్చ్య లభ##తే సద్గతింనరః 53
కపాలీశుని కోటిశుని యధావిధిగా పూజించి సౌభాగ్య వంతుడగును. ఇట్లు మధ్యయాత్రను ముగించవలయును. చాల బ్రహ్మతీర్థమును చేరిన వాడు సర్వదేవ పూజితుడై భుక్తి ముక్తీశుడగును. నరకేశుని చేరి సంవతర్తేశుని నిధీశ్వరుని బలభ##ద్రేశ్వరుని పూజించి భుక్తిముక్తులను పొందును. గంగాగణపతిని చేరి యధావిధిగా పూజించి ఇహపరములందు వాఛితార్థములను పొందును. తరువాత జాంబవతీ నదిని చేరి భక్తిచే స్నానమాడి సురాదులను పూజించి కృతకృత్యుగడును. తరువాత పాండు కూపమును చేరి స్నానమాడి సురాదులను పూజించి కృతకృత్యుగడును. తరువాత పాండుకూపమును చేరి స్నానమాడి పాండవేశ్వరుని పూజించ వలయును. ఇట్లు చేసిన స్వర్గమును చేరి నందనాదులలో విహరించును. శతమేధమును లక్షమేధమును కోటి మేధమును క్రమముగా లింగత్రయమును పూజించి స్వర్గమున దేవతలవలె ఆనందించును. దుర్వాసాదత్యకమును చేరి యధావిధిగా పూజించి అశ్వమేధయాగ ఫలమును పొందును. యాదవస్థలమును చేరి వర్షేశుని పూజించి ఇంద్రునిచే సత్కరించబడి వాంఛితార్థమును పొందును. హిరణ్యా సంగమమున స్నానమాడి బ్రాహ్మణునకు హేమరథము నిచ్చినవారు అక్షయ లోకములను పొందును. తరువాత నగరార్కుని పూజించి సూర్యలోకమును పొందును. నగరాదిత్య పార్శ్వమున బలరామకృష్ణులను సుభద్రను దర్శించి యధావిధిగా పూజించిన కృష్ణ సాయుజ్యమును పొందును. తరువాత కుమారికను చేరి యధావిధిగా పూజించి వాంఛిత కామనలను పొంది భూమండలమును జయించును. తరువాత క్షేత్రపాలుని పూజించి సర్వకామనలను పొందును. సరస్వతీ తీరమున నున్న బ్రహ్మేశ్వరుని పూజించి సర్వపాప వినిర్ముక్తుడై బ్రహ్మలోకమున విరాజిల్లును. పింగలానదిని చేరి, స్నానమాడి దేవతాదులను శ్రాద్ధాదులచే తృప్తి పరిచిన వారు మరల జన్మనందరు. సంగమేశుని పూజించిన వారు దుర్గతిని పొందరు. శంకరాదిత్యుని ఘటేశుని మహేశ్వరుని చక్కగా పూజించి సకలాభీష్ట మాచరించి అచటి ఋషులను పూజించి సర్వతీర్థ ఫలమును పొందును. తరువాత నందాదిత్యుని పూజించి సర్వరోగ విముక్తుడగును. తరువాత త్రితకూపమును చేరి స్నానమాచరించి స్వర్గమును చేరును. శశోపానమున స్నానమునా చరించిన దేవతలను చూడ గలుగును. వాంఛిత కామనలను పొందును. వర్ణాదిత్యమును దర్శించి రోగవర్జితుడు భోగవంతుడగును. తరువాత న్యంకుమతిని చేరి అచట యధావిధిగా స్నానమాచరించి సిద్ధేశ్వరుని పూజించి అణిమా సిద్ధులను పొందును. వారాహస్వామిని చూచి సంసార సాగరము నుండి విడి వడును. ఛాయాలింగమును చక్కగా పూజించి సర్వపాతక వినిర్ముక్తుడగును. గుల్ఫమును దర్శించి పూజించిన నరుడు చాంద్రాయణ ఫలమును పొందును. దేవిని కనకనందను చక్కగా పూజించి ఇహమున సర్వకామనలను పొంది దేహాంతమున స్వర్గమును పొందును కుంతీశ్వరుని పూజించి సర్వపాతక వినిర్ముక్తడగును. గంగానదిలో స్నానమాడి గంగేశ్వరుని పూజించి త్రివిధ పాపములనుండి విముక్తుడగును. చమసోద్భేదకమున స్నానమాచరించి పిండదానమునాచరించిన గయాకోటి గుణ పుణ్యమును పొందును. తరువాత ఉత్తమమగు విదురాశ్రమమునకు వెళ్ళి త్రిగమ త్రిభువనేశును చక్కగా పూజించి సుఖమును పొందును. మంఖణశ్వరుని పూజించినవారు సద్గ తిని పొందుదురు.
త్రైపురం చ త్రిలింగం తు ప్రార్చ్య పాపైః ప్రముచ్యతే | షండతీర్థం తతః ప్రాప్య స్నాత్వా స్వర్ణ ప్రదోనరః 54
సర్వపాప విశుద్ధాత్మా శైవం పదమవాప్నుయాత్‌ | సూర్య ప్రాచ్యాం నరస్స్నాత్వా విపాప్మా భోగవాన్భవేత్‌ 55
త్రిలోచనే నర స్స్నాత్వా రుద్రలోక మవాప్నుయాత్‌ | దేవికాయా ముమానాధం సమర్చ్య మనుజోత్తమః 56
లభ##తే వాంఛితాన్కామాం న్దేహాంతే స్వర్గమాప్నుయాత్‌ | భూద్వారం తు సమభ్యర్చ్య లభ##తే వాంఛితం ఫలమ్‌ 57
శూలస్థానే తు వాల్మీకిం నమస్కృత్య కవిర్భవేత్‌ | చ్యవనార్కం తతః ప్రార్చ్య సర్వకామ సమృద్ధిమాన్‌ 58
కుబేర స్థానకే స్నాత్వా నిధిం ప్రాప్నోతి నిశ్చితమ్‌ 60
ఋషితోయనదీం ప్రాప్య స్నాత్వా తత్ర నరశ్శుచిః | దత్వా సువర్ణం విప్రాయ ముచ్యతే సర్వపాతకైః 61
సంగాలేశ్వర మభ్యర్చ్య రుద్రలోకే మహీయతే | నారదాదిత్య మభ్యర్చ్య త్రికాల జ్ఞానవాన్భవేత్‌ 62
తతో నారాయణం ప్రార్చ్య ముక్తి భాగీ నరో భ##వేత్‌ | తప్త మండోదకే స్నాత్వా మూల చండేశ మర్చయేత్‌ 63
సర్వపాప వినిర్ముక్తో వాంఛితార్థం లభేన్నరః | వినాయకం చతుర్వక్త్ర మభ్యర్చ్యాప్నోతి కామితమ్‌ 64
కంబలేశ్వర మభ్యర్చ్య ధనధాన్య సమృద్ధిమాన్‌ | గోపాలస్వామి పూజాతో గోమాన్వై ధనవాన్కలిః 65
బకులి స్వామినోకభ్యర్చ్య నృణాం సద్గతి దాయినీ | సంపూజ్య మారుతాం దేవీం సర్వకామఫలం లభేత్‌ 66
క్షేమానిత్యార్చనాన్మర్త్యః క్షేమీ సిద్ధార్థ సత్యభాక్‌ | ఉన్నతాఖ్యం విఘ్నరాజం ప్రార్చ్య విఘ్నైర్నహన్యతే 67
జలస్వామీ కాలమేఘః పూజితా సర్వసిద్ధిదౌ | రుక్మణీ పూజితా దేవీ వాంచితార్థ ప్రదా నృణామ్‌ 68
దుర్వాసేశం చ పింగేశం ప్రార్చ్య పాపై ర్విముచ్యతే | భద్రాయాస్సంగమే స్నాత్వా నరో భద్రాణి పశ్యతి 69
శంఖావర్తే నరస్స్నానత్వా సర్వసిద్ధీశ్వరో భ##వేత్‌ | మోక్షతీర్థే నరస్స్నాత్వా భ##వేన్ముక్తో భవార్ణవాత్‌ 70
గోష్పదస్నానమాత్రేణ సర్వసౌఖ్యమవాప్నుయాత్‌ | నారాయణ గృహాం గత్వా నరో భూయో న శోచతి 71
జాలేశ్వరార్చ నాత్పుంసాం సిద్ధయస్స్యుర భీప్సితాః | స్నాతో హుంకారకూపేతు గర్భవాసం న చాప్నుయాత్‌ 73
కలాకుండాప్లుతో మర్త్యో ముక్తిభాగీ న సంశయః | కపిలేశం సమభ్యర్చ్య కపిలాయూధ మాప్నుయాత్‌ 74
జరద్గవేశ్వరం ప్రార్చ్య జరసా నాభిభూయతే | నలేశ్వరార్చకో భోగే కర్కోటే శార్చకో ధనీ 75
హాటకేశ్వర పూజాంతం పూర్యన్తే సర్వకామనాః | నారదేశార్చకో భక్తిం లభేద్విష్ణౌ చ శంకరే 76

స్వర్గార్హో జాయతే
%భ్యర్చ్య దేవీం మన్త్రని భూషణామ్‌ | దుర్గా కూటం గణపతిం పూజయిత్వా సుఖీ భ##వేత్‌ 77
ధనధాన్యయుతో భూయా త్పూజయన్కౌర వేశ్వరీమ్‌ | సుపరేశాం భైరవీంచ పూజయిత్వా సుఖీ భ##వేత్‌ 78
భల్లతీర్ధే నరస్స్నాత్వా ముచ్యతే సర్వ కిల్బిషైః | కర్దమాలే నరస్స్నాత్వా పాతకైర్విప్రయుజ్యతే 79

గుప్త సోమేశ్వరం దృష్ట్వా న భూయో
%ర్హతి శోచితుమ్‌ | బహు స్వర్ణేశ్వరం దృష్ట్వా స్వర్గతిం సమవాప్నుయాత్‌ 80
శృంగే శ్వరార్చకో మర్త్యో న దుఃఖైరభిభూయతే | తీర్థే నారాయణ స్నాత్వా ముక్తి మాప్నోతి మానవః 81
మార్కండేశ్వర మభ్యర్చ్య దీర్ఘాయుర్జాయతే నరః | తథా కోటీహ్రదే స్నాత్వా భ్యర్చ్య కోటీశ్వరం సుఖీ 82
సిద్ధ స్థానే పునస్స్నాత్వా తత్ర లింగాని పూజయేత్‌ | అసంఖ్యాతాని యోమర్త్య స్ససిద్ధో జాయతే భువి 83
దామోదర గృహం దృష్ట్వా సుఖమాప్నోత్యనుత్తమమ్‌ | వస్త్రాపధం ప్రభాసస్య నాభిస్థానే స్థితం శుభే 84
తత్రాభ్యర్చ్య భవం సాక్షా ద్భవేద్భవ సమస్స్యయమ్‌ | దామోదరం స్వర్ణదేఖా బ్రహ్మాకుండం చ రైవతే 85
కుంతీశ ఉజ్జయం తేశ భీమేశశ్చ మహాప్రభః | మృగీకుండం చ సర్వస్వం క్షేత్రే వస్త్రాపథే స్మృతమ్‌ 86
ఏతేషు క్రమశాస్స్నాత్వా దేవానభ్యర్చ్య యత్నతః | పితౄన్సంతర్ప్య తోయేవ సర్వ తీర్థ ఫలం లభేత్‌ 87
దున్నాబిలే నరస్స్నాత్వా భుక్త భోగో దివం వ్రజేత్‌ | గంగేశ్వరం తత్యోభ్యర్చ్య గంగాస్నానఫలం లభేత్‌ 88
గిరౌ రైవతకే దేవి సన్తి తీర్థాన్యనేకశః | తేషు స్నాత్వా నరో భక్త్యా బ్రహ్మ విష్ణు మహేశ్వరావ్‌ 89
ఇంద్రాది లోకపాన్ర్పార్చ్య భుక్తిం ముక్తిం చ విందతి | ఏతాన్యుద్దేశతస్తీర్థా న్యుక్తాని తవ సుందరి 90
అవాంతరాణ్యనంతాని తాని వక్తుం న శక్యతే | ఏకైకస్యాపి తీర్థస్య సంతి విస్తరతః కధాః 91
అతస్సంక్షిప్య గదితం మయా పుణ్యం ప్రభాసజమ్‌ | న ప్రభాస సమం తీర్థం త్రిషు లోకేషు మోహిని 92

యత్రా స్నాతో
% పి మనుజః స్వర్గిణా స్పర్థతే శుభే | మాహాత్మ్యంచ ప్రభాసస్య లిఖితం వర్తతే గృహే 93
యత్ర తత్ర నభీతిస్స్యా ద్భూత చౌరాహిశత్రుజా | యశ్శృణో తి నరో భక్త్యా శ్రావయేద్వా సమాహితః 94

ప్రభాస తీర్థ మాహాత్మ్యం సో
%పి సద్గతి మాప్నుయాత్‌ 95
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
బృహదుపాఖ్యనమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున ప్రభాసతీర్థ మాహాత్మ్యమను
సప్తతితమోధ్యాయము
త్రైపురమగు త్రిలింగమును పూజించి పాప విముక్తుడగును. షండతీర్థమును చేరి స్నానమాడి స్వర్ణదానమును చేసిన వాడు సర్వపాప విశుద్ధుడై శివలోకమును చేరును. సూర్యప్రాచీతీర్థమున స్నానమాడి పాపరహితుడై భోగవంతుడగును. త్రిలోచన తీర్థమున స్నానమాడిన వారు రుద్రలోకమును చేరెదరు. దేవికా తీర్థమున ఉమాకాంతుని చక్కగా పూజించి ఇహమున సకలాభీష్టములను పొంది అంతమున స్వర్గమును పొందును. భూద్వారమును పూజించినవారు వాంఛితార్థములను పొందెదరు. శూలస్థానమున వాల్మీకిని నమస్కరించిన వారు కవలలగుదురు. చ్యవనార్కుని పూజించినవారు ధనధాన్యాన్వితులగుదురు. బాలార్కుని పూజించినవారు విద్యావంతులు ధనవంతులగుదురు. కుబేరస్థానమున స్నానమాడి నిధిని పొందును. ఋషితోయనదిలో స్నానమాడి శుచియైనవాడు స్వర్ణదానమును చేసిన వారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. సంగాలేశ్వరుని పూజించి రుద్రలోకమును విహరించును. నారదాదిత్యుని పూజించి త్రికాల జ్ఞానమును పొందును. తురవాత శ్రీమన్నారాయణుని పూజించి మోక్షమును పొందును. తరువాత తప్త కుండోదకమున స్నానమాడి మూల చండీశుని పూజించిన వారు సర్వ పాప వినిర్ముక్తులై వాంఛి తార్థమును పొందెదరు. చతుర్వక్త్రుడగు వినాయకుని పూజించి కామితములను పొందును. కంబలేశ్వరుని పూజించి ధన ధాన్యసమృద్ధులను పొందును. గోపాల స్వామిని పూజించిన వారు గోవులను ధనమును పొందును. బకుల స్వామిని పూజించి సద్గతిని పొందును. మరుద్దేవిని పూజించిన వారు సర్వకామ ఫలములను పొందును క్షేమాదిత్యుని పూజించుట వలన క్షామము సిద్ధార్థములు సత్యములు కలవాడగును. ఉన్నతాఖ్యుడగు విఘ్నరాజును పూజించిన వారు విఘ్నములను పొందరు. జలస్వామిని కాలమేఘుని పూజించిన సర్వసిద్ధులను ప్రసాదింతురు. రుక్మిణిని పూజించిన వాంఛితార్థములను ప్రసాదించును. దూర్వాసేశుని సింగేశుని పూజించినచో పాపవిముక్తులగుదురు. శంఖావర్తమున స్నానమాడిన సర్వసిద్ధీశ్వరుడగును. మోక్షతీర్థమున స్నానమాడిన సంసార సాగరమునుండి ముక్తులగుదురు. గోష్టదస్నానమున సర్వసౌఖ్యములను పొందను. నారాయణ గృహమునకు వెళ్ళినవారు మరల దుఃఖించరు. జాలేశ్వరార్చన వలన అభీష్ట సిద్ధులు లభించును. హుంకార కూపమున స్నానమాడిన గర్భవాసమును పొందడు. చండీశ్వరుని పూజించిన సర్వతీర్థ ఫలము లభించును. ఆకాశపురగతుడగు విఘ్నేశుని పూజించి విఘ్నములను పొందడు. కలాకుండమున స్నానమాడిన వాడు మోక్షమును పొందును. కపిలేశుని పూజించిన కపిలాగోసమూహమును పొందును. జరద్గవేశ్వరుని పూజించినవారు జరాపీడితులు కారు. నలేశ్వరుని అర్చించినవారు భోగవంతులు, కర్కోటేశుని అర్చించిన వారు ధనవంతులగుదురు. హాటకేశ్వవరుని పూజించుట వలన సర్వకామనలు ఫలించును. నారదేశుని పూజించిన వారు హరిహరులందు భక్తిని పొందెదరు. మన్త్ర విభూషణాదేవిని పూజించిన వారు స్వర్గ వాసార్హులగుదురు. దుర్గాకూట గణపతిని పూజించిన వారు సుఖవంతులగుదురు. కౌరవేశ్వురుని పూజించిన వారు ధనధాన్యయుతులగుదురు. సుపర్ణేశుని భైరవిని పూజించిన వారు సుఖవంతులగుదురు. భల్లతీర్థమున స్నానమాడిన వారు సర్వకిల్బిష ముక్తులగుదురు. కర్తమూలమున స్నానమాడిన వారు పాతక వినిర్ముక్తుడగును. గుప్త సోమేశ్వరుని పూజించిన వారు దుఃఖములను పొందరు. బహుస్వర్ణేశ్వరుని దర్శించిన వారు స్వర్గమును పొందెదరు. శృంగేశ్వరార్చకులు దుఃఖములను పొందరు. నారాయణ తీర్థమున స్నానమాడిన వారు మోక్షమును పొందెదరు. మార్కండేశ్వరుని పూజించిన వారు దీర్ఘాయుష్యమును పొందును. కోటీహ్రదమున స్నానమాడి కోటీశ్వరుని పూజించినచో సుఖములను పొందును. సిద్ధస్థానమున స్నానమాడి అచటి అసంఖ్యా లింగములను పూజించి సిద్ధులగుదురు. దామోదర గృహమును దర్శించి ఉత్తమ సుఖమును పొందును. ప్రభాసనాభిస్థానమున వస్త్రాపథమున నున్న శివుని పూజించినవారు సాక్షాత్తు శివసముడగును. వస్త్రాపధ క్షేత్రమున దామోదరము, స్వర్ణరేఖ, బ్రహ్మ కుండము రైవతమున, ఉజ్జయంతమున కుంతీశము, మహాప్రభుడగు భీమేశుడు మృగీకుండము అనునవి కలవు. క్రమముగా వీటియందు స్నానమాడి యత్నముతో దేవతలను పూజించి పితరులకు జల తర్పణ గావించి సర్వతీర్థ ఫలములను పొందును. దున్నాబిలమున స్నానమాడిన వారు భోగములననుభవించి స్వర్గమును చేరును. గంగేశ్వరుని పూజించి గంగాస్నాన ఫలమును పొందును. రైవత కాద్రిలో చాలా తీర్థములు కలవు. వాటియందు స్నానమాడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇన్ద్రాది లోక పాలకులను పూజించి భుక్తిని ముక్తిని పొందును. ఇవి ముఖ్యములగు తీర్థములు. అవాంతర తీర్థములు అనేకములు కలవు. వాటిని అన్నింటిని చెప్పజాలము. ఒక్కొక్క తీర్థమునకు చాలా విస్తరకథలు కలవు. కావున పుణ్య ప్రదమగు ప్రభాసమాహాత్మ్యమును సంక్షేపముగా చెప్పితిని. మూడు లోకములలో ప్రభాస సమమగు తీర్థము మరియొకటి లేదు. ఇచట స్నానమాడిన వారు స్వర్గవాసులతో పోటీ పడుదురు. ప్రభాసమాహాత్మ్యమును వ్రాసి గృహమున ఉంచుకొనిన భూతచోర సర్పాది భయములు కలుగవు. ఈ ప్రభాస మాహాత్మ్యమును వినిన వారు వినిపించిన వారు కూడా సద్గతిని పొందెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
బృహదుపాఖ్యనమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున ప్రభాసతీర్థ మాహాత్మ్యమను
డెబ్బదియవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page